“మనిషికి జీవన విధానం అవసరమా ?” అనే అంశంతో స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ అఫ్ ఇండియా, ఆంధ్ర ప్రదేశ్ శాఖ రాష్ట్ర వ్యాప్త సందేశ ప్రచార ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమం లో భాగంగా రాష్ట్ర కార్యదర్శి బ్రదర్ ఆమిర్ ఫహద్ స్థానిక విజయవాడ ఇస్కోన్ అర్చకులను కలిసి అనేక ధార్మిక అంశాల మీద చర్చించి అనంతరం దివ్య ఖుర్ఆన్ బహుకరించడం జరిగింది. మత సామరస్యానికి, సోదర భావానికి ఎస్.ఐ.ఓ ఎల్లపుడు ముందుంటుంది అని ఈ సందర్బంగా తెలియచేయడం జరిగింది.