ఈదుల్ ఫిత్ర్ (రమజాన్ ) పండుగ దృష్ట్యా SSC పరీక్ష తేదీలను సవరించవలసినదిగా SSC బోర్డ్ డైరెక్టర్ దేవనంద రెడ్డి గారికి మెమోరాండం అందించిన ఎస్ఐఓ
ఆంధ్ర ప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు 10-02-2022 న పదో తరగతి పరీక్షల టైం టేబుల్ ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షల కోసం నమోదు చేసుకున్నారు. ఈ పరీక్షలు మే నెల 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్నాయి.
ఇవ్వబడిన పరీక్షల ప్రణాళిక ప్రకారం తెలుగు పేపర్ -I ఈదుల్ ఫిత్ర్ పండుగ జరిగే అవకాశం mymedic.es ఉన్న 02-05-2022న నిర్వహించబడునుంది.
ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం లందరూ పవిత్ర రమజాన్ మాసమంతా ఉషోదయం మొదలుకొని సంధ్యాసమయం వరకు ఉపవాసాలు పాటించి, తరువాతి రోజు ఈదుల్ ఫిత్ర్ పండుగను జరుపుకుంటారు.
ఇస్లామిక్ క్యాలెండరు పండుగ జరిగే తేది క్రొత్త నెలవంకను వీక్షించిన తరువాతే నిర్ధారించబడుతుంది.
పండుగ తేదీపై స్పస్థత లేకపోవటంవల్ల ముస్లిం విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులలో పండుగ మరియు పరీక్షల గురించి ఆందోళన నెలకొని ఉన్నది.
పండుగ సమయం అవటం వల్ల రవాణా సమస్య కూడా తలెత్తుతుంది.కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వారిని ప్రకటించిన SSC పరీక్షల టైం టేబుల్ ను ఈదుల్ ఫిత్ర్ పండుగను అనుసరించి రీషెడ్యూల్ చేయవలసినదిగా కోరుతూ SSC బోర్డ్ డైరెక్టర్ దేవనంద రెడ్డి గారికి మెమోరాండం అందజేశారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన డైరెక్టర్ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.